Saturday, October 17, 2009

ఇక్కడ కురిసిన వర్షం ఎక్కడి మేఘానిది?

జయప్రభ నాకు అత్యంత ఇష్టమైన కవి, అందులోనూ ఈ కవిత్వమంటే బాగా ఇష్టం నాకు. పద్యం టైటిల్లోనే ఆలోచింపచేసే కొణాలెన్నున్నాయో!!

సరిహద్దులు గీసుకున్నవి
మనుష్యుల స్వార్ధాలుగాని
దూకే సెలయ్యెళ్హు కావు
అడవులూ జలపాతాలూ కావు
ఇక్కడ కురిసే వర్షం
ఎక్కడి మేఘం మోసిందో
గుర్తించగల వాళ్హుంటే రండి!
భూమి విశ్వరూపాన్ని
ముక్క చెక్కలు చేస్తున్నవి
మతాలు మంత్రాంగాలూనూ.
నిజంగా సరిహద్దులు చేరిపేయగలిగితే
ప్రపంచానికి
నేలా నీరు గాలి అందరివీగాని
ఏడు ఖండాలుగా   విడిపోయిలేవు.

- జయప్రభ
(మూలము: ఇక్కడ కురిసిన వర్షం ఎక్కడి మేఘానిది? జయప్రభ పద్యాలు. చైతన్యతేజ పబ్లికేషన్స్. హైదరాబాద్: ౧౯౯౧.)

2 comments:

  1. విశ్వరూపానికి బ్రౌణ్యాంధ్ర నిఘంటువులో మాటలు ఉన్నాయి. కాని వాటికంతే మీరు వాడినమాటే బాగున్నట్లు అనిపించింది. నేను ఎక్కువగా చదవలేదు కాని, చదివిన కొద్దిట్లో మహే జబీన్ రాసిన 'ఆకురాలుకాలం' కూడా బాగున్నట్లు అనిపించింది. జయప్రభ పద్యాలు ఎక్కువ చదవలేదు. ఒకసారి యెర్నేని లైలా అడిగితే జయప్రభ పుస్తకాలు కొన్ని పంపించాను.

    ReplyDelete
  2. స్వరూప్ గారు,

    చదివినందుకు, వ్యాఖ్యానించినందుకు కృతజ్ఞతలు. క్షమించాలి, ఆలస్యముగా ప్రత్యుత్తరమిస్తున్నాను. నేను బ్రౌన్ నిఘంటువు కన్నా ఇంకా శంకరనారాయణగారిదే అనుసరిసతున్నాను. మీరన్నట్టు, పదాలేన్నున్నా, సరైనది ఎంచుకోవడం కష్టం!

    - లావణ్య.

    ReplyDelete