Friday, October 30, 2009

ఎవరి యుద్ధం వాళ్ళే చెయ్యాలి

నువ్వే

ఎవరి యుద్ధం వాళ్ళే చెయ్యాలి
నీ యుద్ధం నువ్వే గెలవాలి
నీ రక్తంతో నీ మూలిగతో
నీ కత్తీ డాలూ నువ్వే చెసుకోవాలి

అసలు అధర్మం
నీ యుద్ధం ఎవరైనా చేయడమే
అసలు అన్యాయం
నీ కత్తీ డాలూ ఎవరయినా చేసివ్వడమే

ఎప్పుడూ నీ యుద్ధం ఎవరెవరో చేశారు
నిన్ను బతిమాలి
నీ తరుపున యుద్ధతంత్రం రచించారు
నిన్ను గుండెల మీదికి లాక్కుని
నీ కోసం తత్వం రచించారు
నిన్ను బెదిరించి
నీ కోసం శస్త్రధారులయ్యారు.

ఓడినా సరే
ఎవరి యుద్ధం వాళ్ళే చెయ్యాలి
నీ కోసం వాళ్ళు యుద్ధం గెలిచారో
నిలువునా మునిగిపొతావు
ఎప్పటికీ ఓడిపోతావు.


                  - సుధ
నా  అనువాదం.
ఈ కవిత మునుముందు అంధ్రజ్యొత్తి దినపత్రికలో  ముద్రింపబడింది.  నేను చదివింది ఓల్గా  చేకూర్చిన స్త్రీవాద కవితా సంకలనంలో. (నీలి మేఘాలు. స్త్రీవాద కవితా సంకలనం. స్వేచ్చ  ప్రచురణలు. హైదరాబాదు: 1993)

Saturday, October 17, 2009

ఇక్కడ కురిసిన వర్షం ఎక్కడి మేఘానిది?

జయప్రభ నాకు అత్యంత ఇష్టమైన కవి, అందులోనూ ఈ కవిత్వమంటే బాగా ఇష్టం నాకు. పద్యం టైటిల్లోనే ఆలోచింపచేసే కొణాలెన్నున్నాయో!!

సరిహద్దులు గీసుకున్నవి
మనుష్యుల స్వార్ధాలుగాని
దూకే సెలయ్యెళ్హు కావు
అడవులూ జలపాతాలూ కావు
ఇక్కడ కురిసే వర్షం
ఎక్కడి మేఘం మోసిందో
గుర్తించగల వాళ్హుంటే రండి!
భూమి విశ్వరూపాన్ని
ముక్క చెక్కలు చేస్తున్నవి
మతాలు మంత్రాంగాలూనూ.
నిజంగా సరిహద్దులు చేరిపేయగలిగితే
ప్రపంచానికి
నేలా నీరు గాలి అందరివీగాని
ఏడు ఖండాలుగా   విడిపోయిలేవు.

- జయప్రభ
(మూలము: ఇక్కడ కురిసిన వర్షం ఎక్కడి మేఘానిది? జయప్రభ పద్యాలు. చైతన్యతేజ పబ్లికేషన్స్. హైదరాబాద్: ౧౯౯౧.)

Friday, October 16, 2009

తొలిపలుకు

చాలా కాలం  తరువాత తెలుగులో వ్రాస్తున్నాను. కాస్త ఉద్రేకంగా, కాస్త ఆందోళనగా ఉంది! తప్పులు ఉంటాయేమోనని!

దేని గురించి వ్రాయాలి? అఫ్ కోసే, నా గురించే ...'నా' అంటే?

స్త్రీ. ఆడది. ప్రపంచంలో సగం.  చాప కింద నీరు. గయ్యాళి. ఆకసంలో సగం.  తల్లి.  ఊసరవెల్లి?

కవిత్వం. నాకు నచ్హిన కవిత్వం. స్త్రీవాద కవిత్వం.

నాకు నచ్హిన కవిత్వములను, కవయిత్రులు గురించి ఈ బ్లాగ్. వీలయితే, చేతనయితే, అనువాదాలు.